సినిమాలు, క్రైమ్ షోల ప్రభావం కచ్చితంగా యువతపై ఉంటుంది అని మరోసారి నిరూపితమైంది. ఒక సినిమా లేదా టీవీ షోలో మంచి- చెడు రెండూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా చేస్తే ఇలాంటి చిక్కుల్లో పడతారని చూపిస్తారు. కానీ, కొందరు మాత్రం ఆ చెడుకే ఎక్కువ ఆకర్షితులవుతూ ఉంటారు. అలా క్రైమ్ షోలు చూసి ఇన్ స్పైర్ అయిన కొందరు యువకులు ఏకంగా హత్య చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. క్రైమ్ షోలూ చూసి ప్రభావితులైన కొందరు యువకులు.. ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డారు. 10 నుంచి 15 మంది యువకులు కలిశారు. దానికి ‘బదనామ్’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఓ రోజు వారి ప్రవర్తన శ్రుతి మించిపోయింది. జనవరి 19న ఓ ఘోరానికి ఒడిగట్టారు. కుర్రాళ్లు ఓ పార్కులో గిల్లీ దండా ఆడుతుండగా.. అక్కడ ఆడకండని వారించాడు. అందుకు ఆగ్రహానికి గురైన కుర్రాళ్లు.. షిబు హుస్సేన్(24)ను ముగ్గురు కలిసి పొడిచి హత్య చేశారు. అంతేకాదు ఆ హత్యాకాండను చిత్రీకరించారు. ఆ దృశ్యాలతో సోషల్ మీడియాలో ఫాలోవర్లు, పాపులారిటీ సాధించాలని ప్రయత్నించారు.
పోలీసులు వారిని విచారణ చేసే సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్రైమ్ షోలు చూసి ప్రభావితమై ఇదంతా చేస్తున్నట్లు 1,4 15, 17 ఏళ్ల కుర్రాళ్లు తెలిపారు. సినిమాలు, క్రైమ్ డ్రామా చూసి ఇలా చేశారని తెలిపారు. అరెస్టు అయ్యారని భయంగానీ, అవుతామేమో అనే బెరుకు గానీ వాళ్లల్లో కనిపించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు వారి తల్లిదండ్రులు ఈ వార్త విని షాక్ కు గురయ్యారు. వారి పిల్లలు ఇలా హత్య చేస్తారని అనుకోలేదన్నారు. పోలీసులు చెప్పిన విధంగా వారి పిల్లలు క్రైమ్ సినిమాలు, షోలు చూసే అలవాటు ఉన్న వాళ్లు కాదని చెబుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు కూడా లేవని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పోలీసులు వారి సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. జువైనల్ హోమ్ కు పంపనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ మైనర్లు వారి పేర్లను సోషల్ మీడియాలో ఎంతో విచిత్రంగా పెట్టుకున్నారు. ‘బదనామ్, షేర్, గ్యాంగ్ స్టర్’ అంటూ పెట్టుకున్నారు. వారిలో ఒక కుర్రాడు బయో అనే ఆప్షన్ లో ‘అడ్రస్ ముకద్మా నం: 302../307’ అని రాసుకున్నాడు. అవి IPC సెక్షన్ 302, 307.. హత్యాయత్నం, హత్యకు సంబంధించిన సెక్షన్లు కావడం గమనార్హం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.