సాఫీగా సాగుతున్న కొందరి దాంతప్య జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి సంసారాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలోని కొంతమంది మహిళలు మాత్రం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భర్తను కాదని, పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. ఇక ఇంతటితో ఆగక.., భర్త అడ్డుగా ఉన్నాడని భావించి చివరికి అతడిని దారుణంగా హత్య చేయిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ పోలీస్ భార్య భర్తను కిరాయి రౌడీలతో హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లాలి ప్రాంతం. ఇక్కడే సెంథిల్ (48), చిత్ర (44) దంపతుల నివాసం ఉంటున్నారు. భర్త కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. దంపతులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తూ నలుగురిలో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. అయితే ఎలాంటి అర్థికంగా ఇబ్బందులు లేకుండా వీరి కాపురం బాగానే సాగుతూ వచ్చింది. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతున్నతరుణంలోనే భార్య చిత్ర పక్క చూపులు చూసింది. ఇంట్లో భర్త ఉండగా కూడా.., పరాయి మగాళ్లపై కన్నేసింది. విషయం ఏంటంటే? భార్య చిత్ర స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. అలా చాలా కాలం పాటు చిత్ర ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే కొంత కాలం తర్వాత భార్య చిత్ర సాగిస్తున్న చీకటి కాపురం భర్త సెంథిల్ కు తెలిసింది.
దీంతో ఒంటికాలుపై లేచిన భర్త.., భార్యపై కోపంతో ఊగిపోయాడు. ఇలాంటి పాడుబుద్ది మార్చుకోకుంటే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్యకు భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలోనే భార్య చిత్రకు ఓ ఆలోచన వచ్చింది. భర్తనే లేకుండా చేస్తే.. ఆ తర్వాత ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. అందు కోసం చిత్ర తనకు తెలిసిన కొందరు వ్యక్తులతో భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చింది. దీంతో సరేనంటూ ఆ కిరాయి రౌడీలు ప్లాన్ వేసి మరీ చిత్ర భర్త సెంథిల్ ను దారుణంగా హత్య చేశారు. కట్ చేస్తే.. సెప్టెంబర్ 16 నుంచి నా భర్త కనిపించడం లేదంటూ చిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య చిత్ర ఫోన్ కాల్ లీస్టును చెక్ చేయగా ఎందుకో ఎందుకో ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు భార్య చిత్రను విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అవును.. నా ప్రియుడితో కలిసేందుకు నా భర్త అడ్డుగా ఉన్నాడని, అందుకే రౌడీలతో కలిసి హత్య చేయించానని ఒప్పుకుంది. అనంతరం పోలీసులు చిత్రతో పాటు మరికొంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన ఈ పోలీస్ భార్య తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.