ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా హద్దులు దాటి వివాహేతర సంబంధాలకు పావులు కదుపుతున్నారు. తమ చీకటి వ్యవహారానికి భర్త అడ్డొస్తే చివరికి అతనిని అడ్డు తొలగించుకునేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడి మోజులో పడి ఊహించని దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో విజయశాంతి, నవీన్ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఏదో పని చేసుకుంటూ ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగా సాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే భార్య విజయశాంతి తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. దీంతో స్థానికంగా ఉండే శివ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇదే పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా విజయశాంతి భర్త నవీన్ కు తెలియకుండా శివతో ఫొన్ లో మాట్లాడుతూ.. చీకటి వ్యవహారాన్ని నడిపించింది. అయితే ఇటీవల శివ విజయశాంతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉండడాన్ని చూసి భర్త నవీన్ చూశాడు. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను మందలించాడు. దీంతో భర్తకు తన చీకటి కాపురం తెలియడంతో భార్య భర్తతో అంటి ముట్టనట్టుగానే నడుచుకుంది.
ఇక విజయశాంతికి భర్తతో కన్న ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. దీంతో ఎలాగైన భర్తను ప్రాణాలతో లేకుండా చేయాలని ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే విజయశాంతి ఇదే విషయాన్ని ప్రియుడు శివకు తెలిపింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు శివ సరేనంటూ ఓకే చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ తో ముందుకు కదిలారు. భార్య భర్తను నమ్మించి ఓ చోటకు తీసుకెళ్లింది. అయితే అక్కడికి వీరి కన్న ముందే ప్రియుడు శివ వచ్చి కూర్చున్నాడు. వాళ్లిద్దరూ రాగానే ఆమె ప్రియుడు శివ అలెర్ట్ అయ్యాడు. అనంతరం ఇద్దరు కలిసి నవీన్ ను దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని కనిపించకుండా పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఇక భార్య విజయశాంతి ఏం తెలియదన్నట్లుగా ఇంటికి వచ్చి.., నా భర్త రెండు మూడు రోజుల నుంచి కనిపించడం లేదంటూ ఏడుస్తూ కూర్చుంది. ఈ విషయం మెల్లగా పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక విచారణలో భాగంగా పోలీసులు ముందుగా నవీన్ భార్య విజయశాంతిని విచారించారు. తనకు ఏం సంబంధం లేదన్నట్లుగా విజయశాంతి కల్లబొల్లి మాటలు వల్లించింది. ఇక పోలీసులు వారి స్టైల్ లో విజయశాంతిని విచారించే సరికి నా భర్తను నా ప్రియుడితో పాటు కలిసి హత్య చేశామంటూ సంచలన నిజాలు బయటపెట్టింది. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడు శివతో పాటు భార్య విజయశాంతిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.