వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. వీరిని తల్లిదండ్రులు కొంత వరకు చదివించారు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితుల నేపథ్యంలో ఓ చోట పనికి కుదిరారు. అక్కడ వీళ్లు చేసిన పని తెలుసుకుని తల్లిదండ్రులు షాక్ గురుయ్యారు.
పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. కూతుళ్లు ఉన్నత స్థితిలో ఉండాలని వీరి తల్లిదండ్రులు బాగా చదివించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అనుకున్నారు. కానీ, ఇంట్లో పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరూ ఓ చోట పనికి కుదిరారు. ఈ క్రమంలోనే ఈ అక్కా చెల్లెళ్లు ట్రాక్ తప్పారు. ముస్లిం యువకులను ప్రేమించారు. ఈ వ్యవహారాన్ని ఈ అక్కా చెల్లెళ్లు కొంత కాలంగా సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ వచ్చారు. అయితే, ఇదే విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో కూతుళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని ఓ ప్రాంతంలో గాయత్రి (23, విద్య (21) అనే అక్కా చెల్లెళ్లు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నారు. వీళ్లును తల్లిదండ్రులు కొంత వరకు చదివించారు. ఆ తర్వాత ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో చదువుకి స్వస్తి పలికినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ అక్కా చెల్లెళ్లు తిరుప్పూర్ లో ఓ టెక్స్ టైల్ మిల్లులో పనికి కుదిరారు. ఇక్కడే చాలా కాలంగా పని చేస్తూ వచ్చారు. అలా కొంత కాలం తర్వాత ఈ అక్కా చెల్లెళ్లు ముస్లిం మతానికి చెందిన యువకులతో ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారాన్ని వీళ్లద్దరూ చాలా కాలంగా సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ వచ్చారు.
అయితే, ఇదే విషయం ఇటీవల వారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కూతుళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో కూతుళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీరి ప్రేమకు అడ్డు చెప్పారని చనిపోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ అక్కా చెల్లెళ్లు కలిసి ఇటీవల స్థానికంగా ఉండే ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.