పెళ్లైన కొంత కాలం పాటు ఈ మహిళ భర్తతో బాగానే సంసారం చేసింది. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఆ మహిళ భర్తను కాకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక ప్రియుడితో గడిపేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి దారుణానికి పాల్పడింది.
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. అలా కొన్నాళ్లకు ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కొడుకుని చూసి దంపతులు ఇద్దరూ మురిసిపోయారు. కట్ చేస్తే.. ఈ దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో ఉండలేక వేరు వేరు కాపురాలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ వివాహితకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇక ప్రియుడితో గడిపేందుకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని ఆ కసాయి తల్లి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టింది.
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పూందమల్లి పరిధిలోని కొరుక్కంబాక్కం గ్రామం. ఇక్కడే సెల్వప్రకాష్-లావణ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకి వీరికి సర్వేశ్వన్ అనే కుమారుడు జన్మించాడు. కొడుకును చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ దంపతులు ప్రతీ విషయానికి గొడవ పడుతూ ఉండేవారు. ఇక భర్తతో ఉండలేని ఆ వివాహిత తన కుమారుడిని వెంటబెట్టుకుని గత కొంత కాలం నుంచి భర్తకు దూరంగా మరో కాపురం పెట్టింది. ఈ క్రమంలోనే లావణ్యకు మణింగడన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది.
దీంతో ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అయితే, ప్రియుడితో గడపడానికి లావణ్య కుమారుడు అడ్డుగా ఉన్నాడు. దీంతో ఆ వివాహితకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే కాదని భావించిన లావణ్య.. తన కుమారుడిని చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే నెల కిందట ఆ వివాహిత ప్రియుడితో కలిసి తన కుమారుడిని దారుణంగా హత్య చేసింది. అనంతరం కుమారుడు సర్వేశ్వన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. ఆ బాలుడు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఇక ఆ తర్వాత ఏం తెలియనట్టు లావణ్య భర్తకు తెలియకుండా కుమారుడి పూడ్చిపెట్టింది.
ఇక ఇటీవల కొడుకు మరణవార్త తండ్రి సెల్వ ప్రకాష్ కు తెలిసింది. కుమారుడి మరణంపై అతడికి ఎందుకో అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఆ బాలుడు హత్యకు గురయ్యాడని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు బాలుడి తల్లి అయిన లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.
మొదట్లో ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఇక గట్టిగా విచారించే సరికి.. ప్రియుడితో గడిపేందుకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని, అందుకే నా ప్రియుడితో కలిసి నా కొడుకుని నేనే హత్య చేశానని నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పడక సుఖానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడిని చంపిన ఈ కసాయి తల్లి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.