ఆమెకు భర్త కంటే ప్రియుడంటేనే ఇష్టం. మనిషి ఇక్కడున్న మనసంతా ప్రియుడి మీదే. అయితే తను పెళ్లి చేసుకునే కన్న ముందే ఓ యువకుడితో పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ప్రియుడిని విడిచి ఉండలేనంతగా తయారైంది. కానీ తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆ మహిళ మరొక యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రియుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తన మనసంతా ప్రియుడి మీదే. పెళ్లైన కూడా ప్రియుడిని మరిచిపోలేకపోయింది. ఏం చేయాలో అర్థం కాక ప్రియుడితో చేతులు కలిపి భర్తను హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మరుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని తెన్‌కాశి జిల్లా, సెందామరం పరిధిలోని వెండ్రిలింగాపురం. ఇదే గ్రామానికి చెందిన వైరస్వామి(31), మూత్తుమారి (25) భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ హోల్ సెల్ ఫర్నిచర్ దుకాణంలో దంపతులు ఇద్దరు పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. అయితే ఇటీవల శుక్రవారం భార్యాభర్తలిద్దరూ బైక్ మీద వీరశిఖామణి నుంచి వారి ఇంటికి వెళ్తున్నారు. నడుంకురిచ్చి చేరుకునే లోపు రాత్రి 9 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు భర్త వైరస్వామిని దాడి చేసి దారుణంగా హత్య చేసి, భార్య మెడలో ఉన్న నగలు తీసుకెళ్లిపోయారు.
స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా భార్య మూత్తుమారిని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారించారు. అసలు గుట్టు విప్పిన భార్య దిమ్మతిరిగే సమాధానాలు బయటపెట్టింది. భర్తను నా ప్రియుడితో పాటు నేనే హత్య చేయించానని, నాకు భర్తతో ఉండడం ఇష్టం లేకే ప్రియుడితో చేతులు కలిపి భర్తను హత్య చేయించినట్లు భార్య పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్త వద్దు ప్రియుడే ముద్దు అనుకున్న ఈ కిలాడీ లేడీ ఖతర్నాక్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.