వీడో నీచమైన ప్రబుద్దుడు. పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్లడం, ఏకాతంగా కలిసి ఉన్న లవ్ కపుల్స్ ని వీడియోలు, ఫోటోలు తీయడం చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. ఇలా ఎవరికీ తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసి లవ్ కపుల్స్ కు షాకిచ్చాడు. అయితే ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ ప్రబుద్దుడి మోసాలను కొందరు లవ్ కపుల్స్ పసిగట్టి చితకబాది పోలీసులకు అప్పగించారు తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ జులాయిగా తిరుగుతుండేవాడు. అయితే అతనికి ఏం చేయాలో తెలియక లవ్ కపుల్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్లడం, ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం. ఇదే ఇతగాడి పని. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 జంటలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇతగాడి లీలలను గమనించిన కొందరు లవ్ కపుల్స్ స్థానికులకు చెప్పడంతో అందరూ వచ్చి అతడిని చితకబాదారు.
ఇది కూడా చదవండి: పాపం.. ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో!
అనంతరం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణ మానసిక స్థితిని అంచనా వేస్తున్నారు. వీడియోలు తీసి డబ్బు కోసం లవ్ కపుల్స్ ని వాడుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రేమ జంటల వీడియోలు, ఫోటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న రామకృష్ణ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.