మామూలుగా అత్తింటి వేధింపులను తట్టుకోలేక కోడలు ఇంటి ముందు నిరసనకు దిగినట్లు చాలా సార్లు వార్తలు చూశాం. విన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అత్తింటి ముందు అల్లుడు ధర్నాకు దిగుతోన్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
కట్నం కోసమో, నగలు కోసమో కోడల్ని అత్తారింటి వాళ్లు హింసకు గురిచేస్తారు. పుట్టింటి నుండి అదనపు కట్నం తావాలంటూ ఇంటి నుండి గెంటేయడం లేదా కోడలిపై దాడులకు తెగబడతారు. అయితే ఆత్మాభిమానం ఉన్న కోడలు.. అటు పుట్టింటికి వెళ్లలేక.. అత్తాంటిటి ఆరళ్లను భరింస్తుంది. వేధింపులు ఎక్కువైతే.. తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు నిరసన చేస్తుంది. ఇటువంటి ఘటనలు చాలానే చూశాం. కానీ ఇప్పుడు మనం చదవబోయే వార్త పూర్తి రివర్స్. ఓ అల్లుడు అత్తగారింటి ముందు నిరసనకు దిగాడు. ఈ వినూత్న ఘటన తెలంగాణాలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కోదాడకు చెందిన రమణి పృథ్వికి హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ కుమార్‌తో 2018 ఆగస్టులో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు కౌటిల్య కార్తికేయన్ ఉన్నాడు. 2021 వరకు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అయితే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో భర్తతో గొడవపడిన రమణి.. ఏడాదిన్నర క్రితం తన బాబుతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలేసి రమణి కెనడాకు వెళ్లింది. రమణి వెళ్లిపోవడంతో బాబు కోసం ప్రవీణ్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ప్రతి వారం తండ్రి బాబును చూడొచ్చని 9 నెలల క్రితం కోర్టు తీర్పునిచ్చింది. కౌటిల్యను చూసుకునేందుకు పలుమార్లు వచ్చినప్పటికీ రమణి తల్లిదండ్రులు చూపించలేదు.
దీంతో తన కొడుకు చూపించాంటూ ప్రవీణ్ కుమార్ తన అమ్మానాన్నలతో కలిసి అత్తారింటి ముందు నిరసనకు దిగాడు. అంతేకాకుండా ఓ భారీ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అందులో కొడుకు కౌటిల్య పట్ల ప్రేమను కనబరుస్తూ, తనతో గడిపేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. మూడేళ్ల తన కొడుకుకు కోసం తీసుకున్న ఇష్టమైన బొమ్మలతో ఆందోళనకు చేశాడు. ఏడాదిన్నరగా తన కొడుకుకు దూరంగా ఉంటున్నానని ప్రవీణ్ తెలిపాడు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ తన కొడుకుని రమణి తల్లిదండ్రులు తమకు చూపించడం లేదని ప్రవీణ్ వాపోతున్నారు. అభిప్రాయ భేదాల వల్ల కొడుకు, కోడలు విడిపోయారని, వాటిని పరిష్కరించే ప్రయత్నం తన కోడలు ఏ మాత్రం చేయలేదని ప్రవీణ్ తండ్రి చెప్పారు. బాబును చూడకుండా రమణి తల్లిందండ్రులు అడ్డుకుంటున్నారని తెలిపారు.