ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.. వికలాంగులవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్య, అతి వేగం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కొన్నిసార్లు బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం.. అతివేగం ప్రమాదాలకు కారణం అయితే.. కొన్నిసార్లు బస్సుల్లో సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్యాపేట జిల్లా మొద్దులచెరువు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన రాజధాని ఏసీ బస్సు సూర్యాపేట మొద్దుల చెరువు ఇందిరానగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ స్కూటీకి ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను హుటాహుటిని కిందకు దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన డ్రైవర్, క్లీనర్ తమ ప్రాణాలు రక్షించుకోవడమే కాదు.. ప్రయాణీకులు ప్రాణాలు రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. స్కూటీని ఢీ కొట్టడంతో బస్సు షాట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న రాజధాని బస్సు సూర్యపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులను వెంటనే కిందకు దింపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. నడిరోడ్డుపై బస్సు దగ్ధమైపోవడంతో 65వ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు.