నేటి పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు. మంచి ఉద్యోగాలు పొందాలంటే మంచి విద్య అవసరం అని అంటారు. పదో తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైన మలుపు. ఈ కారణంతోనే పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటారు.
ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్య అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఇక విద్యార్థి దశలో కీలకమైన మలుపు పదో తరగతి. అలాంటి పదో తరగతి వార్షిక పరీక్షల్లో తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలని ఓ వైపు తల్లిదండ్రులు.. మరోవైపు తమ విద్యార్థులు టాపర్ గా ఉండాలని ఉపాధ్యాయులు కోరుకుంటారు. మంచి మార్కులు తెచ్చుకునేలా పిల్లలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంటారు. కొన్నిచోట్ల ఎక్కువ మార్కులు సాధిస్తే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తుంటారు ప్రజా ప్రతినిధులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థ అధినేతలు. తాజాగా టెన్త్ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధిస్తే లక్ష రూపాయల బహుబతి ఇస్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు 500 పైగా మార్కులు సాధిస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు. కరటంపాడు ఉన్నత పాఠశాలలో 14 సంవత్సరాలుగా ఈ బంపర్ ఆఫర్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థ విద్యార్థుల కోసం 73 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన గార్లపాటి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహకంగా పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధిస్తే లక్ష బహుబతి గా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. కరటంపాడు ఉన్నత పాఠశాలలో 2007 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత చదువులకు బాటలు వేయాలన్న ఉద్దేశ్యంతో గార్లపాటి ఫౌండేషన్ వారు ఈ అద్భుతమై కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు ఉన్నత పాఠశాలకు ఓ ప్రత్యేక ఉంది.. ఇక్కడ చదివే విద్యార్థులు చదువుకునే దశలోనే తమ ప్రతిభ నిరూపించుకొని లక్షాధికారి అవుతున్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి.. భవిష్యత్ లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో గ్రామ మాజీ సర్పంచ్ గార్లపాటి వేణగోపాల నాయుడు ఈ దిశగా ప్రోత్సాహకాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఆయన స్థాపించిన గార్లపాటి ఫౌండేషన్ తరుపున పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు పద్నాలు సంవత్సరాల నుంచి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం 525 మార్కులు సాధిస్తే లక్ష రూపాలయ బహుబతి ఇస్తానని ఆయన విద్యార్థులకు ఆఫర్ ప్రకటించారు. ఫౌండేషన్ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహం ఇంటర్ ఆ పై చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.