ఏపీలో జంట హత్యల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వదినతో మరిది సంబంధం అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వదినతో మరో యువకుడు చనువుగా ఉన్నాడనే కారణంతో మరిది ఆ యువకుడిని దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కొందరు గ్రామస్తులు స్పందించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యల ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన ఎర్రమ్మకు సంతోష్ తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రామారావు అనే యువకుడు ఎర్రమ్మ, సంతోష్ కుమార్ ను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భయంతో రామారావు అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అయితే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో తీవ్ర కలకలంగా మారింది. ఈ జంట హత్యలపై గ్రామస్తులు స్పందించి అసలు నిజాలు బయటపెట్టారు. అసలు ఈ హత్య ఘటనపై గ్రామస్తులు ఏం చెప్పారంటే?
ఎర్రమ్మ అనే వివాహితతో రామారావు, సంతోష్ లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న సంగతి మాకు తెలియదని, గ్రామస్తులు అనుకుంటూనే వింటున్నామని చెప్పారు. సంతోష్ కుమార్ మాత్రం ఎవరితో గొడవలు పడే వ్యక్తి కాదని, అందరితో స్నేహ పూర్వకంగా కలిసి మెలిసి ఉండేవాడని అన్నారు. ఇక రామారావు కూడా మంచి వ్యక్తేనని, బాగా చదువుకున్నాడని తెలిపారు. పోటీ పరీక్షలకు సైతం సిద్దమయ్యేవాడని అన్నారు. మద్యం తాగేవాడని మాత్రం మాకు తెలుసుని చెప్పుకొచ్చారు. మద్యం మత్తులోనే ఇంత దారుణానికి పాల్పడి ఉండవచ్చిన గ్రామస్తులు చెప్పారు. అయితే ఇద్దరు యువకులు ఎలాంటి తప్పులు చేయడం మేమెక్కడ వినలేదని గ్రామస్తులు తెలిపారు.
ఎర్రమ్మ కూడా అందరితో మంచిగా ఉండేదని, తనంతట తాను కష్టపడి పని చేస్తూ ఎవరికీ హాని చేసే వ్యక్తి కూడా కాదని అన్నారు. మొత్తానికి ఈ జంట హత్యలపై మా గ్రామస్తులకు అంతు పట్టడం లేదని గ్రామస్తులు తెలిపారు. మరి కొంత మంది మాత్రం.. ఎర్రమ్మ, రామారావు మధ్య వివాహేతర సంబంధం ఉన్నది వాస్తవం అని కూడా చెప్పారు. రామారావు మాత్రం అందరితో గొడవలు పెట్టుకునేవాడని చెబుతున్నారు. అయితే గతంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రామారావు, సంతోష్ కు మధ్య ఓ గొడవ జరిగిందని, ఆ పగతోనే రామారావు సంతోష్ ను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
అసలేం జరిగిందంటే?
శ్రీకాకుళం జిల్లా సారవకోట పరిధిలోని కోదడ్డపనస గ్రామంలో ఎర్రమ్మ అనే మహిళ నివాసం ఉండేది. ఆమె గతంలో వివాహం జరిగి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయ్యే రామారావు అనే యువకుడు ఎర్రమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో సంతోష్ కుమార్ అనే యువకుడు సైతం ఎర్రమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని రామారావు అనుమాన పడ్డాడు. దీంతో రామారావు సంతోష్ కుమార్ పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఎర్రమ్మ, సంతోష్ కుమార్ లను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం కాలువ వద్ద స్నానం చేస్తున్న సంతోష్ కుమార్ ను రామారావు కత్తితో దారుణంగా హత్య చేశాడు. వెంటనే పొలం పనుల్లో బిజీగా ఉన్న ఎర్రమ్మను సైతం రామారావు కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భయంతో అదే కత్తితో గొంతు కోసుకుని రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు.