ఇర్రచంద్రభూషణ్, భాగ్యలక్ష్మి దంపతులు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది. కానీ, భర్త తాగుడుకు బానిసై భార్యను వేధించాడు. దీనిని తట్టుకోలేని భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.
మద్యం.. ఇదే పచ్చని సంసారాల్లో నిప్పులు పోసేలా చేస్తుంది. ఇదే తాగుడు బానిసై కొందరు కుటుంబాలను రోడ్డున పడేసుకోవడమే కాకుండా.. జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా ఇలాగే తాగుడుకు బానిసైన ఓ భర్తకు ఓ భార్య ఊహించని షాకిచ్చింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. అది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పెద్దకారగాం. ఇదే గ్రామంలో ఇర్ర చంద్రభూషణ్ (37), భాగ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది. అయితే రాను రాను భర్త చంద్రభూషణ్ తాడుడుకు బానిసై రోజు మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. ఇంతటితో సరిపెట్టకుండా భార్యపై దాడి కూడా చేసేవాడని సమాచారం.
అయితే చంద్రభూషణ్ ఎప్పటిలాగే మంగళవారం కూడా అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఇక రావడమే కాకుండా భార్యతో గొడవపడి దాడికి పాల్పడ్డాడని సమాచారం. ఇక ఇన్నాళ్లు భరించిన భాగ్యలక్ష్మి తట్టుకోలేకపోయింది. దీంతో భయంలో ఆ మహిళ వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి అర్జెంట్ గా రావాలంటూ కబురు పంపింది. దీంతో హుటాహుటిన వచ్చిన భాగలక్ష్మి సోదరుడు.. బావను కర్రలతో దాడి చేశాడు. అయితే ఇతని దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రభూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
దీనిపై స్పందించిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మద్యం మత్తు కుటుంబాలను నాశనం చేస్తుందని, దీనికి ఎవరూ కూడా బానిసలు కావద్దని స్థానికులు వాపోతున్నారు.