ఆమె పేరు పైలా ఊర్వశి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిధిలోని అంతర్ సింగి గ్రామానికి చెందిన ఈమె కాశీబుగ్గ జాతీయ రహదారిలో ఉన్న ఓ హోటల్ లో కూలీగా చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఊర్వశి నాన్న ఆ యువతి చిన్నతనంలోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ యువతి తన అన్నయ్యతో పాటే ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. ఉన్నన్ని రోజులు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు.
కాగా ఈ మధ్యకాలంలోనే ఊర్వశి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు పయానమయ్యాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న ఆ యువతి హోటల్ లో పని చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే గత శనివారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., ఉర్వశి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఒంటరిగా ఉన్న బాధతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఊర్వశి ఆత్మహత్యలో మరేదైన కారణం ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.