ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్నీ రంగాల్లో దూసుకెళ్తున్నారు. ప్రతి రంగంలోనూ మగవారికి ధీటుగా పోటీపడుతున్నారు. ఇలా ప్రతి విషయంలో అభివృద్ధివైపు మహిళలు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు వరకట్నాల వేధింపులతో అనేక మంది ఆడపిల్లల బలయ్యేవారు. నేటికాలంలో చాలా వరకు అలాంటి వేధింపులు తగ్గాయి. అయిన కూడా అక్కడక్కడ ఆడపిల్లలు వరకట్న వేధింపులు గురవుతున్నారు. తాజాగా ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ నవవధువు మృతికి కట్నం వేధింపులు కారణమని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఘటన కర్నాటక జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక జిల్లా దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మియాపురంకు చెందిన గంగాధర్ కు అదే గ్రామానికి చెందిన రూపాబాయి(22) మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో మూడు గ్రాములు బంగారం తక్కువ ఇచ్చారంటూ గంగాధర్, అతడి తల్లిదండ్రులు రూపాబాయిని సూటిపోటీ మాటలతో వేధింస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. అలా అత్తింటి వారి వేధింపులను భరిస్తూనే మూడు నెలల కాలాన్ని వెలదీసింది. ఇటీవల రూపాబాయి గర్భం దాల్చింది. గర్భవతి అనే కనికరం లేకుండా రూపాబాయిపై వేధింపులు మరింతగా చేశారు. చిరవరకి వారి వేధింపులు భరించలేక రెండు రోజుల క్రితం రూపాబాయి విషం తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నగిరి ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ రూపాబాయి శనివారం మృతి చెందింది. అయితే తమ కుమార్తెతో ఆమె భర్త గంగాధర్, అత్త, మామలు బలవంతంగా విషం తాగించి ఆమె మృతికి కారణమైనట్లు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలనుకామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: దారుణం: కోర్టు ప్రాగంణంలోనే కత్తితో భార్య పీక కోసిన భర్త.. ఎందుకంటే? ఇదీ చదవండి: భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్త.. ఎందుకో తెలుసా?