ఆమెకు ఉన్నత చదువులు చదవాలని కోరిక బలంగా ఉంది. బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంది. పాల్ టెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయాలనుకుంది. కానీ ఇటీవల రాసిన ఈసెట్ లో ఆమెకు సీటు లభించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైంది. దీనిని తట్టుకోలేక ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఛాట్లపల్లి.
ఇదే గ్రామానికి చెందిన కదుర్ల కనకయ్య, బాల్ నర్సమ్మ దంపతుల రెండో కుమార్తె శ్రీకన్య (19). ఇటీవలే పాటిటెక్నిక్ ను ఎలక్ట్రానిక్స్ లో పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేద్దాం అనుకుని ఇటీవల ఈసెట్ కూడా రాసింది. ఆగస్టులో వెల్లడైన ఈసెట్ ఫలితాల్లో ఆమెకు ఇంజనీరింగ్ సీటు దక్కలేదు. దీంతో శ్రీకన్య తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇంజనీరింగ్ చేయాలన్న తన కోరిక నేరవేరకపోవడంతో తట్టుకోలేకపోయింది. ఇక ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసింది. మెల్లగా ఇంటి డాబాపైకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ యువతి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకన్య తల్లిదండ్రులు కంట కన్నీరు ఆగడం లేదు. అనంతరం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.