సీఐ స్వర్ణలత.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ పేరు తెగ వైరల్ అవుతుంది. విశాఖపట్నంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత కేసులో ఊహించని మలుపులు, ట్విస్టులతో కూడిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సీఐ స్వర్ణలత.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ పేరు తెగ వైరల్ అవుతుంది. విశాఖపట్నంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత కేసులో ఊహించని మలుపులు, ట్విస్టులతో కూడిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సీఐకి సినిమాలంటే పిచ్చి. ఓ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అంతేకాదు, సినిమా బాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్టై రిమాండ్‌లో ఉన్న సీఐ స్వర్ణలత లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయి. ఈ సీఐ సీరియల్ ఎపిసోడ్‌లో కొత్తగా మరో కోణం వెలుగులోకి వచ్చింది.
డిపార్ట్‌మెంట్ లోపలైనా, బయటైనా మేడమ్ అంటే అందరికీ హడల్. డ్యూటీలో ఉన్నంత వరకు ‘కర్తవ్యం’ సినిమా.. డ్యూటీ దిగితే ‘కమర్షియల్’ సినిమా.. రిమాండ్‌లో ఉన్నప్పటికీ, లోపల నుండి కూడా తనదైన చేతివాటం చూపిస్తూ, డిపార్ట్‌మెంట్‌ని హడలెత్తిస్తున్నారట. ఈమె వ్యవహారంలో కొత్తగా తెరపైకి డ్రైవర్ శ్రీనివాస్ పాత్ర వచ్చింది. లీవ్‌లో ఉంటూనే మేడమ్‌తో కలిసి దందాలు చేసేవాడట. స్వర్ణలత అరెస్ట్ కాకముందు నెల రోజులుగా అతను డ్యూటీకి రావట్లేదు. అయినా అటెండెన్స్ మాత్రం పడుతుంది. ఆ నెల రోజులు అతగాడు ఏమేం పనులు చేశాడు?.. స్వర్ణలత అతడిని మిగతా క్రైమ్ పనులకు వాడుకున్నారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు. నెల రోజులు డ్యూటీకి డుమ్మా కొడితే, పై అధికారులకు ఫిర్యాదు చెయ్యాల్సి ఉన్నాఆమె ఆ పని ఎందుకు చెయ్యలేదు?.. ఇలా ఎన్నో అనుమానాలు..
దీంతో సీఐ మేడమ్‌తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ మీద కూడా స్పెషల్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. అలాగే ఆమె బెయిల్ కోసం పెద్ద పెద్ద లీడర్ల నుండి ఒత్తిడి వస్తుందని, వీలైనన్ని ఎక్కువ రోజులు రిమాండ్‌లోనే ఉంచాలనే ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. ఇందుకోసం విశాఖలోని కొందరు కీలక నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. స్వర్ణలతను బయటకు తీసుకొచ్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామంటూ పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు. కానీ ఎంతటి ఒత్తిడి వచ్చినా, ఆమెను వదిలే ప్రసక్తే లేదంటూ పట్టుదల మీదున్నారు పోలీసులు. ఆమెపై వ్యతిరేకంగా కోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆమె నెల జీతం రూ. లక్ష లోపే. కానీ మెయింటినెన్స్ మాత్రం 3 లక్షలకు పైగానే ఉండేదట. మేకప్, ట్రావెలింగ్ ఖర్చుల కోసం వసూళ్లు చేసేవారట.
ఇది కూడా చదవండి: స్వర్ణలత కేసులో ఊహించని ట్విస్ట్.. షాకిచ్చిన దర్శకుడు