ఓ వ్యక్తి ప్రాణ స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ షామిర్ పేట్ లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ ఫౌండేషన్ ను ప్రారంభించి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే ఇతనికి ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు. చక్రధర్ గౌడ్ ఇంటికి అతని స్నేహితుడు రావడం, అతని ఇంటికి చక్రధర్ గౌడ్ వెళ్తుండేవాడు. అలా వెళ్తూ వస్తున్న క్రమంలోనే.. చక్రధర్ గౌడ్ తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ వ్యక్తి ఆమెతో కోరికలు తీర్చుకోవాలని అనుకున్నాడు.
ఇక పక్కా ప్లాన్ లో భాగంగానే చక్రధర్ గౌడ్.. ఇటీవల తన స్నేహితుడు ఇంట్లో లేని టైమ్ లో అతని ఇంటికి వెళ్లాడు. అతని భార్యతో మాట్లాడుతున్నట్లు నటించిన చక్రధర్ గౌడ్.. మెల్లగా ఆమెను తాకరాని చోట తాకాడు. ఇంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారం కూడా చేయబోయినట్లు సమాచారం. ఈ దుర్మార్గుడి పాడు పనులకు ప్రతిఘటించిన ఆ మహిళ.. వెంటనే చక్రధర్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చక్రధర్ గౌడ్ అరెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.