నేటి కాలంలో కొందరు మనుషులు దుర్మార్గులు మారి రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు మగాళ్లు కట్టుకున్న భార్యలను అనుమానంతో వేధిస్తున్నారు. వారి వేధింపులతో భార్యను హత్య చేయడమో, లేదంటే భర్త టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. తాజాగా మల్కాజ్ గిరి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మౌలాలి పరిధిలోని హనుమాన్ నగర్ లో లలిత(28), శంకర్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త స్థానికంగా ఏదో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి భార్య లలిత తరుచు ఫోన్ ఫోన్ లో మాట్లాడుతుండడం భర్త చూశాడు. దీంతో అప్పటి నుంచి భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇక ప్రతీ రోజు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. పైగా ఈ క్రమంలోనే లలిత చేతిపై ఓ పేరును పచ్చబోట్టుగా వేసుకుంది. దీంతో అప్పటి నుంచి నా అనుమానం నిజమేనన్నట్లుగా భావించాడు భర్త.
ఇదే విషయమై భార్యాభర్తల ఇటీవల కాలంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం తెల్లవారు జామున సైతం భార్యాబర్తల మధ్య గొడవ రాజుకుంది. అది చినిగి చినిగి తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన భర్త చెక్కతో భార్య తలపై బలంగా బాదాడు. దీంతో లలిత రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.