యువతి, యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ దీనికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా సరే పెద్దలను ఎదురించి మరీ ఓ గుడి వద్ద పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి కుటుంభికులు కొన్ని రోజుల తర్వాత యువతిని బలవంతంగా తీసుకెళ్లి అనంతరం హైస్ అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ప్రియుడిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టారు. తాజాగా సంగారెడ్డిలో వెలుగు చూసిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీ రోడ్ 01 లో నారాయణ రెడ్డి అనే యువకుడు తన స్నేహితులతో పాటు నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న నారాయణ రెడ్డి గతేడాది ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి యువతి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో నారాయణ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంభికులు నారాయణ రెడ్డిపై కోపం పెంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఆలస్యంగా తలుపు తీసిన భార్య.. కోపంతో నరికి చంపిన భర్త!
ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి నారాయణ రెడ్డి కనిపించకపోవడంతో అతని కుటుంభ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే సంగారెడ్డిలో నారాయణ రెడ్డి తగలబెట్టిన మృతదేహాం కనిపించడం తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి బుంధువులే ఇలా చేసిఉంటారని అనుమానిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.