అది శుక్రవారం రాత్రి 9 గంటల సమయం. ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్లు చేసిన దారుణం చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
అది రాత్రి 9 గంటల సమయం. ఊరికి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె భర్త ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో ఇంట్లో భార్య వంట చేస్తుంది. ఈ క్రమంలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్ తో ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి ఊహించని కిరాతకానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి, శైలజ దంపతులు. వీళ్లు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో గత 10 ఏళ్లుగా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో శైలజ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇక ఇదే మంచి సమయమని భావించిన కొందరు గుర్తు తెలియని దుండగులు.. రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లారు. ఇక వెళ్తూ వెళ్తూనే కత్తులతో శైలజపై కత్తులతో దాడి చేశారు. ఈ దుండగులు దాడిలో శైలజ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
కొంతసేపటి తర్వాత భర్త నరేందర్ రెడ్డి ఇంటికి వచ్చి చూడగా.. భార్య శైలజ రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. ఈ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే ఖంగారుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శైలజ మృతదేహాన్ని పరిశీలించారు. ఇక భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మహిళను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.