ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ఎంచక్క పడక సుఖానికి అలవాటు పడి నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక క్షణిక సుఖం కోసం హద్దులు దాటిన కొందరు వ్యక్తులు హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ భార్య భర్తను కాదని పరాయి మగాడి కోసం ఆరాటపడి చివరికి ఉన్న పరువును బజారును పడేసుకుంది. ఇటీవల రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? సికార్ జిల్లాలోని షేకావతి ప్రాంతంలో సోనుదేవి, దయారామ్ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2016లో వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా కాపురాన్నినెట్టుకుంటూ వచ్చారు. ఇలా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే.. భార్య సోనుదేవి వక్రమార్గం వైపు అడుగులు వేసింది. దీంతో పరాయి సుఖం కోసం ఆశపడి కైలాష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా భార్య భర్తకు తెలియకుండా తన చీకటి సంసారాన్ని గడుపుతూ వచ్చింది. అయితే అర్థరాత్రి భార్య సోనుదేవి ప్రియుడితో గడిపేందుకు ఓ మాస్టార్ ప్లాన్ రచించింది. అదేంటంటే? భర్తకు అన్నంలో మత్తు మందు ఇచ్చి తినిపిస్తుంది. ఇక భర్త నిద్రలోకి జారుకున్నాక ప్రియుడిని రమ్మంటూ కబురు పంపుతుంది. ఇక భర్త, పిల్లలు అందరూ పడుకున్నాక సోనుదేవి ప్రియుడి కైలాష్ తో బెడ్ రూంలో తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల పాటు భార్య సోనుదేవి చీకటి కాపురం ఘనంగా వర్దిల్లుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో భర్త, పిల్లలు పడుకున్నాక భార్య ప్రియుడితో బెడ్ రూంలో ఉంది. ఇక కొద్ది సమయం గడిచాక బెడ్ రూం నుంచి ఏదో శబ్దం వినిపించడంతో పిల్లలు లేచి చూశారు. తల్లి ఎవరితోను బెడ్ రూంలో నగ్నంగా పడుకుని కనిపించింది. ఇదే విషయాన్ని ఆ పిల్లలు పడుకున్న తండ్రిని లేపి మరీ చెప్పారు. భర్త నిద్రలేచి బెడ్ రూంలోకి తొంగి చూడగా.., భార్య ప్రియడితో చూడకూడని స్థితిలో కనిపించింది. ఈ నమ్మలేని నిజాన్ని చూసిన భర్త కోపంతో ఊగిపయాడు. భార్య ప్రియుడిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.
దీంతో అలెర్ట్ అయిన ప్రియుడు కైలాష్.. తన వద్ద ఉన్న కత్తితో దయారామ్ ను బెదిరించి ఇంట్లో నుంచి పారిపోయాడు. దీంతో ఇదే విషయమై దయారామ్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కానీ, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రియురాలి భర్త కైలాష్ పై కేసు పెట్టడంతో కైలాష్ దయారామ్ కు ఎదురు తిరిగాడు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతానని బెదిరించాడు. ఇక సహించలేకపోయిన దయారామ్ కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల స్పందించిన న్యాయస్థానం బాధితులకు అండగా ఉంటామని హామి ఇచ్చింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.