ఈ మధ్యకాలంలో కొందరు భర్తలు విర్రవీగి ప్రవర్తిస్తున్నారు. డబ్బు మైకంలో పడి ఎందాకైన తెగిస్తున్నారు. ఇంకొందరు భర్తలు అయితే డబ్బుకు కక్కుర్తిపడి భార్యను ఏకంగా వ్యభిచార ముసుగులోకి పంపించడం, వరకట్నం అంటూ వేధించడం వంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ భర్త డబ్బుకు కక్కుర్తిపడి కట్టుకున్న భార్య అని కనికరం లేకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జనక్ గంజ్ లో చోటు బాధమ్, లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే లక్ష్మీ తల్లిదండ్రులు పెళ్లి సమయంలో చోటు బాధమ్ కు కట్నం కింద నగదుతో పాటు బంగరం, వెండి ముట్టజెప్పారు. దీంతో కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే గత కొంతకాలం నుంచి లక్ష్మీ భర్త చోటు బాధమ్ భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తూ ఉన్నాడు. ఇక భర్త పెట్టే టార్చర్ ను భరిస్తూ వస్తున్న భార్య ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయేది. ఇదిలా ఉంటే ఈ నెల 3న భర్త పుట్టింటి నుంచి రూ.25 వేలు తేవాలంటూ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది.
ఇక పట్టలేని కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై దాడికి పాల్పడ్డాడు. కర్రలతో ఇష్టమొచ్చిన రీతిలో భార్యపై దాడి చేశాడు. క్రూరంగా వ్యవహరించి చేసిన భర్త దాడిలో భార్య కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీనిపై వెంటనే స్పందించిన లక్ష్మీ తల్లిదండ్రులు కూతురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొంత కోలుకున్న తర్వాత భార్య లక్ష్మీ తన తండ్రిని వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్ కు వచ్చింది. కేవలం రూ.25 వేల కోసమే నా భర్త నా కాళ్లు, చేతులు విరిగిపోయేలా కొట్టాడని, అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే భర్త తీరుపై మండిపడ్డ స్థానికులు.. కట్టుకున్న భార్యపై వరకట్నం కోసం ఇంత నీచానికి దిగడమేంటి అంటూ మండిపడుతున్నారు.