భర్త తక్కువ జీతం సంపాదిస్తున్నాడే కారణంతో ఓ ఇల్లాలు భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఇటీవల రాజస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది రాజస్తాన్ రాష్ట్రంలోని బార్మర్. ఇదే ప్రాంతానికి చెందిన మంజూ-అనిల్‌కుమార్ భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహమైంది. పెళ్లైన కొంత కాలం నుంచి వీరి దాంపత్య జీవితం బాగానే సాగేది. భర్త స్థానికంగా ఓ చిన్న ఉద్యోగం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తుండేవాడు. అయితే అతనికి వచ్చే జీతంతోనే ఇంట్లోకి నెలకు సరిపడా కూరగాయలు, మిగతా అవసరాలకు ఖర్చుచేసేవాడు.
వాటన్నిటి ఖర్చులు పోను మిగిలి వాటిని ఇతర ఖర్చులకు ఉపయోగించేవాడు. కానీ భార్య మంజూకు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆశ కొట్టుమిట్టాడుతుండేది. దీంతో భర్తకు వచ్చే జీతంతో తను అనుకున్న ఈ కోరికలు తీరేవి కావు. ఈ కారణంతోనే భర్తతో భార్య అనేక సార్లు వాగ్వాదానికి దిగేది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ మద్యం సేవించారు. అనంతరం డబ్బుల విషయంలో ఇద్దరికి చిన్న గొడవ జరిగింది. అది చినిగి చినిగి ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Russia: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంటి ఓనర్.. పీక్కుతిన్న 20 పెంపుడు పిల్లులు!
దీంతో కోపంతో ఊగిపోయిన భార్య క్షణికావేశంలో బెల్టుతో భర్త గొంతును నులిమి దారుణంగా హత్య చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారుంటున్న గదిలోకి వెళ్లారు. అప్పటికే అనిల్ కుమార్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు నిర్దారణకు వచ్చారు. అనిల్ కుమార్ హత్యపై తల్లి స్థానిక పోలీసులకు భార్య మంజూపై ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అనిల్ కుమార్ భార్యను అరెస్ట్ చేసి విచారించారు. అన్ని కోణాల్లో విచరించగా హత్య చేసింది నేను అంటూ మంజూ ఒప్పుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.