రష్యాలో ఘోరం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లులు ఓనర్ ర్ ను పీక్కుతిన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక మీడియా తెలిపిన కథనం ప్రకారం.. రష్యాలోని రోస్టోవ్ లో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే ఆ మహిళకు పిల్లులు అంటే మహా ఇష్టం. ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ 20 పిల్లులను సాదుకుంటుంది. వాటికి సమయానికి ఆహారం అందిస్తూ వాటిని పెంచుకుంటుంది.
ఇది కూడా చదవండి: Guntur: పాపం పసి పిల్లలు.. ఈ ఇల్లాలు కాస్త కనిపెట్టి ఉండాల్సింది!
అయితే ఉన్నట్టుండి ఆ ఇంటి ఓనర్ రెండు వారాల కిందట ప్రమాదవశాత్తు కిందపడి మరణించింది. దీంతో ఆ పిల్లులకు ఆహారం పెట్టే నాదుడే కరువయ్యాడు. ఆ పిల్లులు అన్ని ఆకలితో అలమటిస్తున్నాయి. అయితే కదలకుండా పడి ఉన్న ఆ మహిళ శవాన్ని ఆ 20 పెంపుడు పిల్లలు గుర్తించాయి. ఇక ఒకటి తర్వాత ఒకటి ఎగబడి ఆ మహిళ శవాన్ని పీక్కుతిన్నాయి. అయితే ఈ ఘటనను గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లులను చెదరగొట్టగా అప్పటికే సగానికి పైగా తిన్న ఆ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.