రాజస్థాన్ లోని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు HIV సోకిన విషయం తెలిసినా కూడా భార్యతో పాటు పరాయి మహిళలతో అనేక సార్లు శృంగారంలో పాల్గొన్నాడు. ఈ విషయం తాజాగా భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఈ దుర్మార్గుడు ఇంతటి దారుణానికి పాల్పడడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రామంచ.
ఇదే గ్రామానికి చెందిన శివయ్య అనే వ్యక్తికి రమాదేవి అనే మహిళతో వివాహమైంది. వీరి పెళ్లై మూడు సంవత్సరాలు గడిచింది. కానీ ఈ దంపతులకు పిల్లలు మాత్రం పుట్టలేదు. ఇదిలా ఉండగానే భర్త పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా భార్యకు తెలియకుండా భర్త ఆ మహిళలతో కోరికలు తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే శివయ్యకు HIV సోకింది. కొన్నాళ్లకి ఈ విషయం శివయ్యకు తెలిసినా కూడా అతను తగు జాగ్రత్తలు పాటించకుండా భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: పిల్లలతో సంతోషంగా సాగుతున్న కాపురం.. ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో!
ఇక కొన్నాళ్లకి భర్తకు HIV సోకిందన్న విషయం తెలియడంతో భార్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే తాను కూడా టెస్ట్ చేసుకోవడంతో రమాదేవికి కూడా HIV అంటుకుంది. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో తెలియక నెత్తి, నోరు బాదుకుంది. పుట్టెడు శోకంలోనే భర్త చేసిన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త శివయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్త శివయ్య చేసిన ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.