భార్యాభర్తల వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. ఇలాంటి గొడవలకే కొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖపట్నంలో సరిగ్గా ఇలాంటి గొడవలకే ఓ వివాహిత తన పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ వివాహిత కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాణిపేట మండలం తాడివీధికి చెందిన శాంతరాజు అనే వ్యక్తికి ఎలుజుల లీలావతితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అయితే గత 5 సంవత్సరాల కిందట భర్తతో జరిగిన గొడవ కారణంగా భార్య తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా కాపురం పెట్టింది. కొంత కాలం వారకు బాగానే ఉంది. ఇక ఈ క్రమంలోనే లీలావతి గత నెల 27న తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది.
ఇది కూడా చదవండి: Karimnagar: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. యువతి ఎవరూ లేని టైమ్ చూసి!
దీనిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. పైగా ఎలాంటి రిప్లయ్ రాలేదు. దీంతో రెండు మూడు రోజులుగా అటు ఇటు అంతా వెతికారు. అయినా లీలావతి, పిల్లల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో భయందోళనలకు గురైన తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 9440796010లో తెలియజేయాలని కోరారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.