మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కలిసి ఏడడుగులు వేశారు. ఏనాడు కూడా గొడవలు లేకుండా అపురూపమైన దంపతులుగా కలిసి జీవించారు. ఇక భర్తను విడిచి భార్య, భార్యను విడిచి భర్త. ఇలా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారుు. కానీ ఉన్న ఊరిలో ఉపాధి లేక భర్త గల్ఫ్ దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడబెట్టిన సొమ్మునంత భర్త భార్యకు పంపించేవాడు. అయితే ఇటీవల గల్ఫ్ దేశంలో భర్త హఠాన్మరణం చెందాడు. భర్త మరణవార్త విన్న భార్య.. భర్త మృతదేహం ఇంటికి రాకముందే ప్రాణాలు విడిచింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపల్లి. ఇదే గ్రామానికి చెందిన నాయిని రాజారాం, దేవేంద్ర భార్యాభర్తలు. వీరికి పెళ్ళై చాలా ఏళ్లే అవుతుంది. అయితే ఉన్న ఊరిలో ఉపాధి లేక భర్త 22 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లోనే పని చేస్తున్నాడు. అక్కడ పోగు చేసిన సోమ్మునంత అవసరాల నిమిత్తం ఇంటికి పంపిస్తుండేవాడు. అలా వారి కాపురం కొన్నాళ్ల పాటు సంతోషంగానే సాగుతూ వచ్చిది. అయితే గల్ఫ్ దేశంలో ఉన్న భర్త ఉన్నట్టుండి ఇటీవల గుండె పోటుతో మరణించాడు. భర్త మరణవార్త విన్న భార్య తట్టుకోలేకపోయింది.
పైగా ఆమెకు అనారోగ్య సమస్యలు, భర్త మరణించాడన్న బాధ. దీంతో భార్య దేవేంద్ర తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే దేవేంద్ర మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ దేవేంద్ర ఈ నెల 1న ప్రాణాలు విడిచింది. ఇలా వారం పది రోజులకే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత్యువులో కూడా వీరి బంధం వీడిపోలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.