వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన కొందరు మహిళలు భర్తకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలా తన చీకటి కాపురానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య దారుణానికి పాల్పడింది. ఏకంగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి గోతి తొవ్వి అందులో పాతి పెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటుకల పహాడ్. మాడివి దేవేందర్, పార్వతి దంపతులు. మధ్యప్రదేశ్ కు చెందిన వీళ్లు స్థానికంగా ఉన్న అటవీ శాఖ ప్లాంటేషన్ లో కార్మికులుగా పని చేస్తున్నారు. ఇక వీరితో పాటు రామ్ లాల్ అనే వ్యక్తి కూడా కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఎప్పటి నుంచో పార్వతి రామ్ లాల్ పై మనసుపడింది. భర్తకు తెలియకుండా అతనితో అప్పుడప్పుడు శారీరక కోరికలు తీర్చుకుంది. కాగా ఆదివారం రాత్రి పార్వతి, రామ్ లాల్ ఇద్దరూ ఏకాంతంగా ఉండడం పార్వతి భర్త దేవేందర్ చూశాడు. భర్తకు తన చీకటి వ్యవహారం తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఇక ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచేందుకు గోతి తవ్వి అందులో భర్త శవాన్ని పాతి పెట్టింది. కాగా ఇటీవల రామ్ లాల్ తాగిన మత్తులో తన తోటి మిత్రులతో దేవేందర్ ను హత్య చేసిన విషయాన్ని చెప్పి నోరు జారాడు. దీంతో మెల్లగా ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో.., ప్రియుడి కోసం పార్వతి భర్త దేవేందర్ ను హత్య చేసి పాతి పెట్టినట్లుగా తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇలా పరాయి సుఖం పాకులాడి ఏకంగా కట్టుకున్నవాడిని హత్య చేసి పాతి పెట్టిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పని మీద బయటకు భర్త.. పడక గదిలో మరిదితో భార్య!