ఈ యువకుడి పేరు రవితజ. ఇతనికి మేన మరదలు అంటే ఎంతో ఇష్టం. ఇద్దరూ గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఉన్నట్టుండి ఆ యువతి పెళ్లి చేసుకోనని షాకిచ్చింది. మరదలు మాట విని ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?
ఇతనికి తన మరదలు అంటే ఎంతో ఇష్టం. చాలా కాలం నుంచి ఆమెను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ యువతి కూడా అతనితో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. దీంతో బావ, మరదలు చెట్టా పట్టాలేసుకుని తెగ తిరిగారు. ఇక పెళ్లి మాట ఎత్తగానే మరదలు ఒక్కసారిగా దిమ్మతిరిగే షాకిస్తూ.. నేను పెళ్లి చేసుకోనంటూ చెప్పింది. మరదలు మాట విన్నఆ యువకుడు షాక్ గురయ్యాడు. ఇదంతా కలన, నిజమా అని తెలుసుకోలేకపోయాడు. అయితే మరదలు పెళ్లికి నో చెప్పడంతో ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ గురవుతున్నారు. ఇంతకి ఆ యువకుడు చేసిన పనేంటో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా బ్రహ్మణపల్లి మండలం జక్రన్ పల్లి పరిధిలోని గాంధీ నగర్ ప్రాంతం. ఇక్కడే రవితేజ (26) అనే యువకుడు నివాసం ఉండేవాడు. ఇతనికి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో మేన మరదలు ఉండేది. ఇద్దరూ గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి ఆ యువతి రవితేజతో మాట్లాడడం మానేసింది. పెళ్లి కూడా చేసుకోనని చెప్పినట్లు తెలుస్తుంది. మరదలు పెళ్లికి నో చెప్పడంతో రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఎన్ని సార్లు ఫోన్ చేసినా అస్సలు స్పందించలేదు. ఇక చేసేదేం లేక రవితేజ తాజాగా తెల్లవారుజామున ఆ యువతి ఇంటికి వెళ్లాడు. మరదలిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ అత్తమామలు నిరాకరించినట్లు సమాచారం. దీంతో రవితేజ మరదలు ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ యువకుడు పూర్తిగా కాలి మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరదలి కోసం రవితేజ చనిపోవడంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరదలు పెళ్లికి నో చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న రవితేజ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.