పూణెలో హృదయవిధారక ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి కొడుకును ఏకంగా 16 అంతస్తు భవనం నుంచి తోసేసి దారుణంగా చంపాడు. ఇక ఇంతటితో ఆగని ఆ వ్యక్తి మరో చర్యకు పూనుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల కథనం ప్రకారం… మహారాష్ట్ర పూణే వాకాడ్ లోని ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ఇతనికి పెళ్లై 16 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇతని సంసారం కొంత కాలం పాటు ఎలాంటి కష్టాలు లేకుండా బాగానే సాగుతూ వచ్చింది. అయితే ఇటీవల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ వ్యక్తి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకుని తీసుకుని ఓ 16 అంతస్తుల భవనం ఎక్కాడు. ఆ తర్వాత అతని కుమారుడిని అక్కడి నుంచి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆ బాలుడు కిందపడి చనిపోయాడు. ఇక అంతటితో ఆగని ఆ వ్యక్తి తాను కూడా అక్కడి నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రీకొడుకుల మృతదేహాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ హృదయవిధారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.