నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ని చేర్చగా, ఏ3గా యువతిని చేర్చారు. ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నవీన్ హత్యకు సంబంధించి సమాచారం ఉండి కూడా హసన్- యువతి చెప్పకపోవడం వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కంటే కూడా హసన్ కే ఎక్కువ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హరి ఫ్రెండ్ హసన్, అతని ప్రియురాలు నిహారికను నిందితులుగా చేర్చారు. ఏ2గా హసన్ ని చేర్చగా, ఏ3గా యువతి పేరును పోలీసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నవీన్ హత్యకు సంబంధించి సమాచారం ఉండి కూడా హసన్- యువతి చెప్పకపోవడం, ఆధారాలను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించిన అంశాలకు సంబంధించి పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కంటే కూడా హసన్ కే ఎక్కువ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
నవీన్ ను హత్య చేయబోతున్నట్లు హసన్- యువతికి తెలియదని పోలీసులు నిర్ధారించారు. కాకపోతే హత్య చేసిన తర్వాత వారికి సమాచారం తెలిసినా కూడా పోలీసులకు తెలియజేయలేదనే కారణంతో వారిని కూడా కేసులో చేర్చారు. ఈ కేసులో హసన్ పాత్రపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 17వ తారీఖున నవీన్ ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ నేరుగా హసన్ వద్దకు వెళ్లాడు. అతనితో పాటుగా నవీన్ శరీర భాగాలను సంచిలో వేసుకుని బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి తీసుకెళ్లాడు. హసన్ తో కలిసి అవయవాలను మన్నేగూడలో పారేశాడు. మళ్లీ తిరిగి హసన్ ఇంటికి వెళ్లి అక్కడ దుస్తులు మార్చుకుని రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత రోజు యువతిని కలిసి ఆమెకు నవీన్ హత్య చేసిన విషయం చెప్పి.. ఆమె వద్ద రూ.1500 డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు.
తర్వాత హసన్- యవతితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీన సాయంత్రం యువతిని కలిసి ఆమెకు నవీన్ మృతదేహాన్ని చూపించాడు. 21న నవీన్ తల్లిదండ్రుల నుంచి హరిహర కృష్ణకు ఫోన్ రావడంతో హత్య విషయం బయటపడుతుందని భయపడి హరి పారిపోయాడు. 24న తిరిగి వరంగల్ లో ఇంటికి రాగా… తండ్రి లొంగిపోవాల్సిందిగా కోరాడు. హరిహర కృష్ణ 24న హసన్ తో కలిసి మన్నెగూడలో ఉన్న నవీన్ శరీర భాగాలను తీసుకుని హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ హత్య గురించి తెలిసి కూడా హసన్ సహాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.