అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సులువుగా డబ్బు సంపాదించడం కోసం కొంతమంది అమ్మాయిలను ఎర వేస్తుంటారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వ్యభిచార వృత్తిలోకి దింపుతారు. దేశంలో అనేక చోట్ల ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. రహస్యంగా వ్యభిచార దందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా తమకు అందిన సమాచారంతో దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకెళ్లి వ్యభిచారం చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక హోసూరు కార్పొరేషన్ పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ముగ్గురు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి ఈ పాడు పనికి ఉసికొల్పుతున్నారు.
ఈ ప్రాంతంలో వ్యభిచారం జోరుగా సాగుతుందని జిల్లా ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్ కి రహస్య సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎస్పీ బాబు ప్రశాంత్ నేతృత్వంలో పోలీసులు బాగలూరు రోడ్డు మీద బుధవారం రాత్రి గస్తీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. డెంకణీకోట సమీపంలో అంజలగిరి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (25), క్రిష్ణగిరి భారతీపురం ప్రాంతానికి చెందిన తిరుపతి (32), బెంగళూరు బండేపాళ్య ప్రాంతానికి చెందిన మునిస్వామి (48)గా విచారణలో గుర్తించారు పోలీసులు. ముగ్గురూ కలిసి ఎన్జీవో కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి.. యువతులకు విముక్తి కల్పించారు పోలీసులు.