ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరైన ఒకరినొకరు ఇష్టపడ్డారు. చివరికి పెళ్లి కూడా చేసుకుందామని కలలు కన్నారు. అలా సంతోషాన్ని వెతుకునే లోపే మృత్యువు వారి ఇద్దరిని తరుముకుంటూ దూసుకుని వచ్చింది. సినిమా స్టోరిని మించిన వీరి లవ్ స్టోరిలో చివరికి ప్రేమను గెలిపించుకున్నా.. ప్రేమికులుగా మాత్రం ఓడిపోయారు. ఈ విషాద ఘటన తాజాగా అంతటా చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి జిల్లాలోని బొబ్బిలికి చెందిన 20 ఏళ్ల శివ అనే యువకుడు.. కురుపాంకు చెందిన 16 ఏళ్ల మైనర్ యువతి ప్రేమించుకున్నారు. వీరికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉండడంతో వీరి పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్లపాటు వారి ప్రేమయణాన్ని కొనసాగించారు. అంతలోనే వీరి విషయం పెద్దలకు తెలిసింది. ఓ సారి మందలించే ప్రయత్నం చేయడంతో ఇద్దరూ కలిసి ఓ సారి పారిపోయారు. వెతికిపట్టి మళ్లీ ఇంటికి తీసుకుని సర్దిచెప్పి పంపించారు.
ఇది కూడా చదవండి: పో*ర్న్ మూవీలో నటించిందంటూ భార్యను హతమార్చిన భర్త!అయినా వారి మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ పెద్దలు మాత్రం కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రియుడు శివ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని ప్రియురాలు గ్రామంలోని పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నారని ఊళ్లో జనాలు చెవులు కొరుకున్నారు. ఇక వీరి మరణంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.