కొడుకు ప్రయోజకుడిగా మారాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. వాళ్లకు లేకున్నా సరే పిల్లలకు పెట్టి వాళ్లు పస్తులుంటారు. అలా కొడుకు కోసం ఎంతటి త్యాగానికైన సిద్దపడే ఓ తల్లిదండ్రులు ఊహించని రీతిలో దారుణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులపై కొడుకు వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేకపోయారు. ఓపిక పూర్తిగా నశించడంతో తల్లిదండ్రులు కొడుకుని దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని పల్నాడు జిల్లా కొత్తపల్లి. ఇదే గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొడుకు బాగా చదువుని గొప్ప ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో బుద్దిగా ఉండకుండా జులాయిగా తిరిగాడు. తల్లిదండ్రులు కొడుకుకి అనేక సార్లు బుద్ది చెప్పారు. అయినా కూడా తల్లిదండ్రలు మాటను లెక్కచేయలేదు. ఇక ఇంతటితో ఆగకుండా డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను వేధించడం మొదలు పెట్టాడు.
రోజు రోజుకు ఆ వేధింపులు శృతిమించాయి. ఇక ఆ తల్లిదండ్రులు కొడుకు వేధింపులను తట్టుకోలేకపోయారు. వీడితో ఉండడం మా వల్ల కాదనుకున్నారో ఏమో తెలియదు కానీ.., ఆ కొడుకుని లేకుండా చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఆ తల్లిదండ్రులు ప్లాన్ ప్రకారమే కన్న కొడుకుని దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ డెడ్ బాడీని బస్తాలో కట్టి పొలంలో పాతి పెట్టాలని చూశారు. కానీ ఎలాగో ఆ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా పల్నాడులో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది. కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన ఈ తల్లిదండ్రుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.