ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వీరయ్య అనే వ్యక్తి తన కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తలను వేరు చేసి సంచిలో వేసుకుని ఊరంతా తిరిగాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆస్తి వివాదాల్లో భాగంగా తండ్రి కొడుకును చంపడం, కొడుకు తండ్రిని చంపడం వంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలు మరువక ముందే తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు చేసి రాక్షసుడిలా వ్యవహరించాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచనలంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లవల్లి గ్రామం. ఇక్కడే వీరయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కిశోర్ (25) అనే కుమారుడు ఉన్నాడు. అయితే తాజాగా ఏదో విషయమై తండ్రి కొడుకులు గొడవ పడ్డట్లు తెలుస్తుంది. ఇక మద్యం మత్తులో ఉన్న తండ్రి వీరయ్య దారుణానికి పాల్పడ్డాడు. తన కొడుకు కిశోర్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అతడి తల, మెండెం వేరు చేశాడు. అంతేకాకుండా కుమారుడి తలను సంచిలో వేసుకుని ఊరంతా తిరిగాడు. ఈ సీన్ చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత నిందితుడు వీరయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.