అప్పటి వరకు ఆ కుటుంబంలోని పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా గడిపారు. బుడి బుడి అడుగులతో ఇంట్లో అల్లరి చేస్తూ అల్లారు ముద్దుగా పెరిగారు. ఇక భార్యాభర్తలు సైతం పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కట్ చేస్తే.. ఇద్దరి పిల్లలతో పాటు తల్లి ఇంట్లో శవమై కనిపించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
అది ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతం. ఇక్కడే ఇంద్రాసేనా రెడ్డి, శివలింగేశ్వరి (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత ఏడేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్ల కాలం తర్వాత ఈ దంపతులకు చరణ్ సాయిరెడ్డి (8), జతిన్ రెడ్డి (4) అనే కుమారులు జన్మించారు. దీంతో వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్త ఇంద్రాసేనారెడ్డి తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేశాడు.
విషయం ఏంటంటే? ఇంద్రాసేనారెడ్డి స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా కొన్నాళ్ల భార్యకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన చీకటి కాపురాన్ని నడిపించాడు. అయితే భర్త వ్యవహారం ఇటీవల భార్య శివలింగేశ్వరికి తెలిసింది. ఇలాంటి పద్దతి మంచిది కాదని, బుద్దిగా ఉండాలంటూ భార్య భర్తకు సూచింంచింది. అయినా వినని భర్త.. తన ప్రియురాలితో కలిసి తిరుగాడు. అయితే ఇదే విషయంపై గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
సోమవారం సైతం ఈ దంపతులు ఇద్దరు గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన భర్త, భార్యను కొట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య.. సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక సాయంత్రం భర్త ఇంటికి వచ్చి చూడగా.. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.