ఇతని పేరు అలోక్.. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడికి ఫేస్ బుక్ లో అందమైన రూపంతో కూడిన మేఘన అనే అమ్మాయి పరిచయం అయింది. దీంతో ఆ యువకుడు ఎగేసుకుని ఆ యువతితో మాటా మాటా కలిపాడు. వీరిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకి స్నేహంగా మారింది. ఇక రాను రాను వీళ్ల బంధంగా బలంగా రాటుదేలింది. ఎంచక్కా అలోక్ మేఘనతో ఫేస్ బుక్ లో సరదా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం వంటివి చేశాడు.
అలోక్ తొందరపాటును గ్రహించిన ఆ యువతి మెల్ల మెల్లగా ప్రేమ పేరుతో అతనికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది. దీంతో అలోక్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి బంధం బలంగా మారడంతో పాటు అలోక్ అస్థిపాస్తుల వివరాలన్నీ ఆ యువతికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఎలాగైన అలోక్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన మేఘన అతనితో పెళ్లికి రెడీ అయింది. ఇక అలోక్ ఊరుకుంటాడా.. తన మనసులో ఉన్న ఇష్టాన్ని కూడా బయటకు వదిలి ఆమెతో పెళ్లికి రెడీ అయ్యారు.
ఇది కూడా చదవండి: Texas: టెక్సాస్ స్కూల్‌లో కాల్పులు.. చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్న బాలిక!కట్ చేస్తే అలోక్ మేఘనని పెళ్లి కూడా చేసుకుని రిసెప్షన్ కి బంధువులందరినీ పిలిచాడు. ఇక పెళ్లైన మరుసటి రోజు రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు సాయంత్రం రిసెప్షన్ కి వచ్చిన ఓ అతిథి వధువును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. అతని పేరు మేఘనాథ్ అని, తమకు దగ్గరి బంధువే అని ఆ అతిథి వరుడి కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వరుడు అలోక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
మేఘనాథ్ అందమైన అమ్మాయిగా రూపంతో పాటు పేరును కూడా మర్చేసి మారువేషంలో అలోక్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మేఘనాథ్ రోడ్డుపైకి లాక్కెళ్లి చితకబాది పొడవాటి జుట్టును కత్తిరించారు. ఇక అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలోక్ ఆస్థిపాస్తులకు ఆశపడే ఇలా చేసి ఉండవచ్చిన గ్రామస్తులు చెబుతున్నారు. తాజాగా ఒడిశాలో జరిగిన ఈ ఊహించని ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మారువేషంలో ఓ యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.