భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజమే. కానీ అవే తెలికపాటి వివాదాలకు కొందరు భర్తలు క్షణికావేశంలో ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. భార్య మోసం చేసిందని, అక్రమ సంబంధం పెట్టుకుందని ఇలా కారణాలు వేరైన కట్టుకున్న భార్యలపై అన్యాయంగా దాడులకు కత్తులు నూరుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కసాయి భర్త దారుణానికి పాల్పడ్డాడు. గొడ్డలితో భార్య తలను నరికి ఏకంగా ఆ తలను పోలీసుల స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. తాజాగా ఒడిశాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఒడిశాలోని ఢెంకనాల్. ఇదే ప్రాంతంలో నకపోడి మూఝీ, శుచల అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్నేళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే నడిచింది. అయితే రోజులు మారే కొద్ది భార్య శుచల ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త నకపోడి మూఝీ గ్రహించాడు. ఇదే విషయమై గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
ఇది కూడా చదవండి: ఘోరం: మామను ప్రైవేట్ పార్టుపై కొట్టి చంపిన కోడలు..
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త నకపోడి మూఝీ క్షణికావేశంలో భార్య శుచలపై దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య తల నరికాడు. అనంతరం తల, మొండాన్ని వేరుచేసి తల పట్టుకుని నడుచుకుంటూ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడు నకపోడి మూఝీను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో భర్త నా భార్య నన్ను మోసం చేసిందని, దీని కారణంగానే ఆమెను నరికి చంపానని తెలిపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.