ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గిన్నెలు కడగలేదని ఓ రూమ్ మేట్ ని యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దెంకనల్ జిల్లాకు చెందిన అమర్ బసంత్ మహోపాత్ర (28),కటక్ జిల్లాకు చెందిన శరత్ కుమార్ దాస్ (21),జార్ఖండ్‌కు చెందిన బిర్జు సాహు (40) ముగ్గురూ పూణెలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: పట్టపగలు నడిరోడ్డుపై గ్రామస్తులు మహిళ దుస్తులు చింపి ఆపై!
బానర్ ప్రాంతంలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలోని సొసైటీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురూ ఓ సెలూన్ లో పనిచేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి రూమ్ లోని గిన్నెలు తోమాలని శరత్ కుమార్ దాస్ కు అమర్ చెప్పాడు. దీంతో అమర్ పై కోపం పెంచుకున్నాడు అమర్. ఇక అదే రోజు రాత్రి 11:40 గంటలకు రూమ్ లో గొడవ మెుదలైంది. అమర్ పై వంటగదిలోని కత్తితో దాస్ దాడి చేయడంతో ఛాతీ కింద లోతైన గాయాలయ్యాయి.దీంతో వెంటనే అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో వైద్యులు అప్పటికే చనిపోయాడు నిర్ధారించారు. ఈ ఘటనపై బిర్జు సాహు అనే యువకుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.