పట్టపగలు నడిరోడ్డుపై గ్రామస్తులు మహిళ దుస్తులు చింపి ఆపై!

Lady

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దుస్తువులు చింపి ఆపై వీడియో తీసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తన్ గడీ తాలుకాలోని గురిపల్లా గ్రామం. ఏప్రిల్–19న బాధితురాలు అక్క నివాసం ఉంటున్న ప్రభుత్వ భూమిని కొలిచేందుకు రెవెన్యూ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

అనుకున్నట్లుగానే రెవెన్యూ శాఖ అధికారుల భూమిని కొలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆ భూమిని అధికారులు కొలవడాన్ని కొంతమంది గ్రామస్తులు వ్యతిరేకించారు. దీంతో అక్కడ నుంచి సర్వేయర్‌లను వెళ్లిపోవాలని ఒత్తిడి కూడా చేశారు. ఇక చేసేదేమి లేఖ రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వెళ్లిపోగానే ఏకంగా 35 మంది గ్రామస్తులు బాధిత మహిళపై దారుణంగా ప్రవర్తించారు.

ఇది కూడా చదవండి: లోకల్‌ ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌.. బొమ్మ గన్‌తో మహిళను భయపెట్టి..

పట్టపగలు కోపంతో ఆ మహిళ దుస్తువులు చింపి వీడియోలు తీశారు. ఇంతటితో ఆగకుండా ఆమెపై దాడికి కూడా పాల్పడ్డ తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.