నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి.. కన్నవాళ్లను సైతం వదిలి వెళ్లింది. అతడి నిజ స్వరూపం తెలిశాక దారుణ నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..
నువ్వంటే ప్రాణం.. నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను.. కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను.. కష్టం నీ దరి చేరనీయను అంటూ అతగాడు చెప్పిన మాటలు నమ్మింది. తాను మనసిచ్చింది. తన ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోతే.. వారిని సైతం వదులుకుంది. కన్నవాళ్లను కాదనుకుని.. ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు ఎంతో ప్రేమ పంచిన వ్యక్తి.. ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. ప్రతి దానికి విసుగు, ఆకారణ కోపం. పోనీలే అని సర్దుకుంది. కానీ అతడు మాత్రం తన నిజ స్వరూపాన్ని చూపాడు. ఇలాంటి వాడి కోసమా తన కన్నవాళ్లను కాదనుకుంది అనుకుంది. దాంతో దారుణ నిర్ణయం తీసుకుంది. బిడ్డ చేసిన పని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
నిజామాబాద్, కమ్మరపల్లి మండలం, కోనసముందర్‌కు చెందిన కండె చిన్న బాబు దంతపులు మూడు కుమార్తె భార్గవి. ఆమె కరీంనగర్ పట్టణం, గౌతమినగర్‌కు చెందిన రాజు అలియాస్ సునీల్‌ని ప్రేమించింది. కానీ భార్గవి తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు. దాంతో ఐదేళ్ల క్రితం అనగా 2018లో ఇంటి నుంచి వెళ్లిపోయి.. రాజుని పెళ్లి చేసుకుంది భార్గవి. అప్పటికి ఆమె మేజర్ కావడంతో.. ఆమె నిర్ణయమే చెల్లింది. పెళ్లైన కొంత కాలవ వరకు వారి జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత భార్గవి-రాజుల కాపురంలో వరకట్నం భూతం పెద్ద చిచ్చు రగల్చింది.
తల్లి, సోదరి సాయంతో రాజు.. కట్నం తేవాల్సిందిగా భార్గవిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం భార్గవి తన పుట్టింటికి వెళ్లింది. ఇలా ఉండగా కొన్ని రోజుల క్రితం రాజు.. భార్గవికి కాల్ చేసి.. తాను మరో పెళ్లి చేసుకుంటున్నాని చెప్పాడు. భర్త చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని భావించిన భార్గవి.. ఈ నెల 20న ఒంటరిగా కరీంనగర్‌కు వెళ్లింది. భర్తను కలిసి మాట్లాడింది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ తర్వాత పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు.. ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న భార్గవి కుటుంబ సభ్యులు కరీంగనర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని.. మెరుగైన చికిత్స కోసం భార్గవిని నిజామాబాద్‌కు తరలించారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్గవి కన్ను మూసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కరీంగనర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.