ప్రస్తుత సమాజంలో ప్రేమ, ప్రేమికులు ఈ పదాలు ఎవరికీ కొత్త కాదు. అయితే ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కనిపిస్తే వారికి ప్రేమ అనే ట్యాగ్ తగిలిస్తారు. ఇద్దరు ఒకే బండిపై కనిపిస్తే వారిని ప్రేమికులను చేస్తుంటారు. నిజానికి అక్కా, తమ్ముళ్లు, అన్నా చెల్లళ్లు కలిసి కనిపించినా వాళ్లని ప్రేమికులుగా చిత్రీకరించడం చూస్తున్నాం. అయితే ఇలాంటి మాటలు, చేష్టలను చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు.
కొందరు మాత్రం అలాంటి మాటలను విని తట్టుకోలేక ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిందని భరించలేక నిజామాబాద్లో యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. నందిపేట్ మండలానికి చెందిన యువతీయువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువకుడు వినయ్ కుమార్ మృతిచెందగా యువతి పరిస్థితి విషయమంగా ఉంది.
మెరుగైన చికిత్స కోసం యువతిని నిజామాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రేమికులనే ముద్ర వేయడంతోనే మనస్తాపానికి గురై ఈ పని చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.