ఆమెకు ఏడాది కిందటే పెళ్లి జరిగింది. కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. ఇక బతుకు దెరువు కోసం రాష్ట్రాన్ని విడిచి మరో చోటుకు వెళ్లారు. కట్ చేస్తే.. ఈ మహిళ చేసిన పనికి ఆమె భర్తతో పాటు తల్లిదండ్రులు కూడా షాక్ గురవుతున్నారు.
ఆమెకు ఏడాది కిందటే తల్లిదండ్రులు కుదిర్చిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి భార్యాభర్తలు బతుకు దెరువు కోసం ఉన్నఊరిని విడిచి మరో ప్రాంతానికి వెళ్లి ఓ చోట పనికి కుదిరారు. అక్కడే కొన్నాళ్ల పాటు పని చేస్తూ సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ చేసిన పనికి భర్తతో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర కిన్వాట్ పరిధిలోని ఈనేగాం ప్రాంతానికి చెందిన రాంకిషన్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ల సంతానం. వీరందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి. అయితే చిన్న కూతురైన అనూషకు ఏడదది కిందటే ఉర్దూకి మారుతి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇక వీరంతా బతుకు దెరువు కోసం రాష్ట్రాన్ని విడిచి నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. సారంగపూర్ పరిధిలోని బీరవెల్లి గ్రామంలోని ఓ వ్యక్తి ఇటుక బట్టీల్లో చాలా కాలంగా పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 4న అనూష బహిర్భూమికి వెళ్తున్నాని భర్తకు చెప్పి వెళ్లింది. కానీ, చాలా సమయం దాటినా అనూష తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త, తల్లిదండ్రులు ఖంగారుపడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. అయినా అనూష జాడ మాత్రం దొరకలేదు. ఇక వారికి ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూష ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి అనూష కనిపించకపోవడంతో ఆమె భర్త, తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.