నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ఇంట్లోకి దూరి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బాన్సువాడకు చెందిన సబా సుల్తానాకు మిస్రీగల్లీకి చెందిన అజహర్ తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. భర్త స్థానికంగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుస్తుండేవాడు.
అయితే పెళ్లైన దగ్గర నుంచి ఈ దంపతులు ఇద్దరు అన్యోన్యంగానే జీవించినట్లుగా తెలుస్తోంది. కాగా మంగళవారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సుల్తానా ఇంట్లోకి చొరబడ్డాడు. వస్తూ వస్తూనే ఇనుప రాడ్డుతో ఆ మహిళ తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో అదే రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Tandur: తండ్రి ఎంత చెప్పినా లెక్కచేయలేదు.. స్కూలు నుంచే వెళ్లి ఏకంగా!
చికిత్స పొందిన ఆ మహిళ బుధవారం ప్రాణాలు విడిచింది. దీనిపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ మహిళ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.