తాజాగా ఓ 8 ఏళ్ల బాలిక రోడ్డుపై ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే అటు నుంచి వచ్చిన ఓ దుర్మార్గుడు అభం, శుభం తెలియని ఆ బాలికపై కన్నేశాడు. మెల్లగా దగ్గరకు పిలుచుకుని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక దీంతో సరిపెట్టకుండా మత్తులో కురుకుపోయి వావి వరసుల మరిచి బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కావలిలో ఓ దుర్మార్గుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. గంజాయి మత్తులో ఉన్న ఈ కేటుగాడు.. ఆడుకుంటున్న 3వ తరగతి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళ్ రావునగర్. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల సంతానం. అయితే 3వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె తాజాగా ఇంటి బయట ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే తుఫాన్ నగర్ కు చెందిన ఖాదర్ బాషా అనే యువకుడు అటు నుంచి వచ్చాడు. అక్కడే ఆడుకుంటున్న బాలిక అతని కంటపడింది. ఇక అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు… ఆడుకుంటున్న ఆ బాలికను పిలిచాడు. ఏం తెలియని ఆ బాలిక అతడి వద్దకు అమాయకంగా వెళ్లింది.
అనంతరం ఈ కేటుగాడు తన వద్ద ఉన్న కత్తితో ఆ బాలిక గొంతు కోశాడు. దీంతో పెద్దగా అరిచి ఏడుస్తూ ఆ బాలిక అక్కడి నుంచి నేరుగా ఇంట్లోకి పరుగులు తీసింది. ఏం జరిగిందని ఆ బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించగా.. నేనే కత్తితో గొంతు కోశానని తెలిపాడు. దీంతో వెంటనే ఆ బాలికను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు నిందితుడు ఖాదర్ బాషాను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 8 ఏళ్ల బాలిక గొంతు కోసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.