నేటి కాలంలో బాలికలపై కొందరు బరితెగించి ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతూ దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ సొంత అన్న చెల్లిపై అత్యాచారం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ ఎస్ టి కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే గొడవల కారణంగా కొన్ని ఏళ్ళ కిందట దంపతులు. భార్య కొడుకుల్ని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రి మరో వివాహిత తో సంబంధం పెట్టుకున్నాడు. ఈమెకు మొదటి భర్త( వదిలేసి వెళ్లిపోయిన) ద్వారా ఓ కూతురు, కొడుకు ఉన్నారు. ఇక 5 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ కుటుంబాలు ఏడాది కిందటే మళ్లీ దగ్గరయ్యాయి. దీంతో మొదటి భార్య, రెండవ భార్య కొడుకులు, కూతురు అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: అందమైన కోడలిపై మామ కన్ను.. కొడుకు ముందే బరితెగించాడు!
ఈ క్రమంలోనే మొదటి భార్య కుమారుడు రెండవ భార్య కూతురిపై కన్నేశాడు. దీంతో ఎవరు లేని సమయం చూసి చెల్లిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆ యువకుడు కొన్నాళ్లపాటు సాగించిన ఈ లైంగికదాడిలో బాలిక ఆనారోగ్యపాలైంది. దీంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక బాలికను పరీక్షించిన వైద్యులు తొమ్మిది నెలల గర్భవతి తేల్చారు. దీంతో షాక్ కు గురైన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.