ఉదయం కుమారుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకున్న తండ్రి కూడా సాయంత్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మరణాలతో కుటుంబంలో తీరని దుఃఖం అలుముకుంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్టుగ్రాడ్యుయేట్(నీట్ పీజీ) పరీక్షలపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. నీట్ పీజీ 2023 పరీక్షల్ని వాయిదా వేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నీట్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ రోజు ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ నీట్ పీజీ అభ్యర్థి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి అతడి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
గంటల వ్యవధిలోనే ఈ రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. తమిళనాడులోని మధురైకి చెందిన తమిల్ వేణుమ్ అనే వ్యక్తి ఎమ్‌బీబీఎస్ చదువుతున్నాడు. నీట్ పీజీ 2023 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అతడి తండ్రి పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుమారుడు పెద్ద డాక్టర్ అయితే చూసి మురిసిపోవాలని తండ్రి భావించాడు. కుమారుడి చదువు కోసం చాలా కష్టపడ్డాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ, బుధవారం ఉదయం తమిల్ వేణుమ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఈ విషయం కుటుంబసభ్యుల ద్వారా అతడి తండ్రికి తెలిసింది. కుమారుడి మరణ వార్త తెలియగానే తండ్రి మనసు ముక్కలైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు లేని జీవితం తనకు వద్దు అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. తర్వాత గదిలోకి వెళ్లి అతడు కూడా ఉరి వేసుకున్నాడు. ఒకే రోజు.. అది కూడా గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు చనిపోవటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Heartbreaking Incidents !
Dr Tamilvenum ,MBBS#Madurai
A #NEETPG2023 aspirants who died due to suicide !!After hearing Son death ,
His father Who was working in Police HC
also died due to suicide in evening #RIP 🙏🏻 pic.twitter.com/U8pHjLGL6Y— Indian Doctor🇮🇳 (@Indian__doctor) February 22, 2023