ములుగు జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత హిందుపురంలోని ఓ లాడ్జ్ లో హత్యకు గురైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో పోలీసులు ఈ మహిళ మృతి అనుమానాస్పద రీతిలో ఉందని భావించారు. అనంతరం ఆమెతో పాటు లాడ్జ్ లో దిగిన మహేష్ ను గట్టిగా విచారించగా నేనే హత్య చేశానంటూ పెదవి విప్పాడు. అయితే తాజాగా పోలీసులు అక్షిత హత్య కేసులో మరిన్నిసంచలన నిజాలు బయటపెట్టారు. ఆ నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత (27) ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం అక్షిత తల్లిదండ్రులు రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన ఓ వైద్యుడితో నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కూతురు కూడా జన్మించింది. మరికొన్నిరోజుల తర్వాత అక్షిత భర్త సాయంతో కర్ణాటకలోని చిక్ బళ్లాపురంలోని ఓ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తుంది. అయితే ఆ మహిళ అక్కడ చదువుకుంటూనే అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేది.
అలా వస్తున్న క్రమంలోనే ఓ రోజు అక్షిత ప్రయాణంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన మహేష్ అనే యువకుడు బస్సులో పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే మహేష్ అక్షిత సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో అవుతూ చాటింగ్ చేశాడు. ఇక నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వుంటే నాకు ఇష్టం అంటూ ఏవేవో మాటలు కలిపాడు. మహేష్ మాటలకు కరిగిపోని అక్షిత.. నాకు పెళ్లై ఓ కూతురు కూడా ఉందని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా మెట్టు దిగని మహేష్ అదే పనిగా అక్షితను ప్రేమించాలని వెంటపడ్డాడు. కొన్నిరోజుల తర్వాత అక్షిత సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటోలతో మార్ఫింగ్ చేస్తూ వేMangapetధింపులకు పాల్పడేవాడు.
అయితే ఈ క్రమంలోనే అక్షిత చిక్ బళ్లాపురం వెళ్లాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 23వ ఆ మహిళ జైపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కి 24వ తేదీన హిందుపురంలో దిగింది. అయితే అక్షితతో పాటు మహేష్స సైతం అదే ట్రైన్ లో వచ్చి అక్షితను ఫాలో అయ్యాడు. దీంతో మహేష్.. మాట్లాడుకుందామని చెప్పి అక్షితను హిందుపురంలో ఉన్న ఓ లాడ్జ్ కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరి మధ్య ఓ గొడవ జరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన మహేష్ అక్షితను గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇస్తూ.. మేమిద్దరం స్నేహితులమని, అక్షిత నిద్రలోనే మరణించిందనే కథ అల్లి పోలీసులకు చెప్పాడు. ఇక మహేష్ పై అనుమానం రావడంతో పోలీసులు అతనిని గట్టిగా విచారించగా.., నేనే హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. అక్షిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కలకలంగా మారిన అక్షిత హత్య కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.