ప్రియురాలిని నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్లిన ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే మొదట్లో ఇది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు ఆ తర్వాత ప్రియుడిని విచారించగా నేనే హత్యాచేశానంటూ ఒప్పుకున్నాడు.పోలీసులు తెలిపిన కథనం మేరకు.. తెలంగాణ ములుగు జిల్లా మంగంపేటకు చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్ణాకటలోని చిక్కబళ్లపరం మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. ఆమెకు గతంలో ఆర్థోపెడిక్ అనే వైద్యుడితో పెళ్లైందని, ఓ కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్షితకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కాగా వీరిద్దరూ కలిసి ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఓ లాడ్జ్ లో దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., అక్షిత అదే లాడ్జ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మహేష్ ను విచారించగా.., మేము ఇద్దరం స్నేహితులమని, తిని పడుకున్నామని, ఆ తర్వాత చూస్తే ఆమె చనిపోయి ఉందని తెలిపాడు. ఎక్కడో మహేష్ పై అనుమానం రావడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.., నేనే అక్షితను హత్య చేశానని ఒప్పుకున్నాడు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని అక్షిత కుటుంబ సభ్యులకు చేరవేశారు. అక్షిత మరణించిందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వ్యాపారికి కొడుక్కి ఎర.. పుష్ప గ్యాంగ్ అదిరిపోయే ప్లాన్!