ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధం మోజులో పడి పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ భర్తను కాదని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక ఇంతటితో ఆగకుండా ఆ మహిళ ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుని రొమాన్స్ కు తెర లేపింది. ఇక కోడలు ప్రియుడితో ఉండగా అత్తమామలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అత్తమామలు ఎలా పట్టుకున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ లో అలీఘర్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ మహిళ భర్తతో సంసారం బాగానే చేసింది. అలా ఈ దంపతుల కాపురం సజావుగా సాగుతున్నతరుణంలోనే ఆ వివాహిత పక్క చూపులు చూసింది. ఇక ఇంతటితో ఆగకుండా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆ మహిళ ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంది. అత్తమామలకు తెలియకుండా బెడ్ రూంలోకి దూరి ప్రియుడితో ఎంచక్కా సరసాలకు దిగింది.
కొద్దిసేపటి తర్వాత కోడలు పడక గది నుంచి ఏవేవో శబ్దాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చిన అత్తమామలు కోడలి రూమ్ లోకి తొంగి చూడగా కోడలు ఓ యువకుడితో శారీరకంగా కలిసి ఉంది. అత్తమామలు వెంటనే తలుపులకు గడియవేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ ప్రియుడిని ఓ డబ్బాలో దాచిపెట్టింది. అత్తమామల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తలుపులు తీసి చూడగా గదిలో ఆ మహిళ ఒంటరిగా కనిపించింది. దీంతో పోలీసులు ఇంట్లొ అంతా వెతికి చివరికి ఓ డబ్బాను ఓపెన్ చేసి చూడగా అందులోంచి ఆ మహిళ ప్రియుడు బయటకు వెళ్లాడు. ఆ తర్వాత పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
— Hardin (@hardintessa143) December 11, 2022